మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బండారి లేఔట్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు.. మహిళలకు ఎగ్జిబిషన్ అండ్ సేల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్‌ను తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఇంట్లో తయారు చేసిన హ్యాండ్ మేడ్ గృహోపకరణ వస్తువులు, వంటకాలు, కాలుష్య రహితంగా పండించిన కూరగాయలు ప్రదర్శనలో ఉంచారు. యువతుల మనసు దోచే అలంకరణాలనూ ప్రదర్శించారు.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించేందుకు చట్ట పరంగా చర్యలు తీసుకునేలా కృషి చేస్తా. స్త్రీ రక్షణ కోసం పాటుపడుతా. మహిళా అభ్యున్నతికి చేపట్టే కార్యక్రమాలను మహిళా సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్తా.
-సునీతా లక్ష్మారెడ్డి, మహిళా కమిషన్ ఛైర్పర్సన్
ఇదీ చూడండి: అవయవదానానికి ఒప్పుకున్న రక్షిత తల్లిదండ్రులు