ఉప్పల్ ఒకప్పుడు గ్రామం. నేడు దినదినం అభివృద్ధి చెందుతూ ఐటీ పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. హైదరాబాద్ పశ్చిమ నగరంలోనే ఐటీ పరిశ్రమలు కేంద్రీకృతం కాగా ప్రభుత్వం అభివృద్ధి నగర నలుదిక్కులా విస్తరించాలని సంకల్పించి ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటిస్తోంది.
ఈ క్రమంలోనే నగరానికి తూర్పుదిక్కున ఉన్న ఉప్పల్‌లో ఇప్పటికే కొన్ని ఐటీ కార్యాలయాలు ఉండగా భవిష్యత్తులో భారీగా రానున్నాయి. ఉప్పల్‌లో మెట్రో కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒకప్పుడు గ్రామంగా ఉన్న ఉప్పల్ నేడు మెట్రో కేంద్రం రేపు ఐటీ పరిశ్రమల వెలుగులతో విరాజిల్లనుంది. ప్రస్తుతం మెట్రో మార్గం ఉప్పల్ ప్రాంతానికి వన్నె తెచ్చింది.
- ఇదీ చూడండి : ఖమ్మంలోనే ఐటీ కొలువులు.. ఉద్యోగుల సంతోషం