పచ్చని మొక్కలు.. రంగురంగుల పూలతో నిండిన ఈ ప్రాంతాన్ని చూడగానే ముచ్చటగా అన్పిస్తుంది. అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కొద్దిసేపు గడిపినా..కొత్త ఉత్తేజం కలుగుతుంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం పురపాలిక సంఘం పరిధిలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో ఖాళీ స్థలంలో అందమైన మొక్కలు పెంచుతున్నారు.
వాడిని నీటిని శుద్ధి చేసి
తాగేందుకు గ్లాసు మంచినీరు దొరకని పరిస్థితిలో ఉన్న తరుణంలో లక్షలాది మొక్కలకు ప్రతిరోజు నీరు ఎక్కడి నుంచి వస్తుందనే అనుమానం కలగొచ్చు. ఇక్కడి వాసులు రోజు వాడుకునే నీటిని నేరుగా ఓ బావిలోకి మళ్ళిస్తున్నారు. ఆ మురికినీటిని శుద్ధి చేసి గుట్టపై ఉన్న ట్యాంకర్‌లోకి పంపి, పైపులైన్ ద్వారా పూల మొక్కలకు, చెట్లకు ఉపయోగిస్తున్నారు. టౌన్‌షిప్‌లో ఉన్న సుమారు లక్ష పైగా మొక్కలకు, చెట్లకు ఈ పద్ధతిలో నీరందిస్తున్నారు.
సుజలాం-సుఫలాం సాయంతో
గత ఏడాది మే నెలలో 'ఈనాడు-ఈటీవీ' చేపట్టిన సుజలాం-సుఫలం కార్యక్రమంలో టౌన్‌షిప్ అసోసియేషన్ సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులతో చర్చించి సుమారు రూ. లక్షా 50 వేలతో 20 ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. గతేడాది తవ్విన ఇంకుడు గుంతల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి నీటి సమస్య రాలేదని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి : వరణుడి బీభత్సానికి నీటిలో కొట్టుకు పోయిన ధాన్యం