మహిళల కోసం ప్రత్యేకంగా హెల్త్ సెంటర్లు ప్రారంభించడం శుభ పరిణామమని మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాచుపల్లిలోని ఎస్ఎల్జీ ఆస్పత్రిలో సఖీ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ సెంటర్ను ఆమె ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానాన్ని కల్పిస్తుందని ఆమె అన్నారు. మహిళల్లో వచ్చే క్యాన్సర్లు నిర్ధారించుకునే పద్ధతులను వివరిస్తూ ఆస్పత్రి వైద్యులు ఏర్పాటుచేసిన ప్రదర్శనను సందర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని నీలా గోపాల్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఛైర్మన్ దండు శివరామరాజు, ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోమరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.