మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో ఉన్న రాష్ట్రీయ విద్యా కేంద్రం(ఆర్‌వీకే)ను 25 రోజుల క్రితం హోం ఐసోలేషన్ కేంద్రంగా మార్చారు. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా విజృంభిస్తుండటం, కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు తన వంతు సహాయంగా ఆర్‌ఎస్‌ఎస్ ముందుకు వచ్చింది. 260 పడకలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇక్కడ హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి కావాల్సిన సౌకర్యాలతో పాటు ఇమ్యూనిటీని పెంచేందుకు తీసుకోవాల్సిన కషాయం ఇతరత్ర మందులను అందించడంతో పాటు యోగా చేయిస్తున్నారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ కూడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పటి వరకు 85 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందిన బాధితులు కోలుకుని ఇంటికి వెళ్లారు.వారికి ఐసోలేషన్‌లో పని చేసే వైద్యులు, సిబ్బంది, చికిత్స పొందుతున్న బాధితులు చప్పట్లు కొట్టి, పూలు చల్లి వీడ్కోలు పలికారు.
ఇదీ చదవండి: సెంట్రల్ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట