'గెలిపించండి... పార్లమెంట్లో ప్రజా సమస్యలు వినిపిస్తా' - pared ground
మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని తెరాస ప్రభుత్వం చూస్తోందని రేవంత్ వ్యాఖ్యానించారు. తనను గెలిపిస్తే ప్రజా గొంతుకనై ఉంటానని హామీ ఇచ్చారు.
పరేడ్ గ్రౌండ్లో రేవంత్ ప్రచారం
మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రచారం నిర్వహిస్తూ యువతతో ముచ్చటించారు. ఈ మైదానంలో సచివాలయం నిర్మిస్తానని కేసీఆర్ అంటున్నారని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పాలనలో ఐదు సార్లు కూడా సెక్రటేరియట్‌కు రాని వ్యక్తి కొత్తగా సచివాలయం నిర్మిస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాగొంతుకను వినిపించే నాయకుడినే ప్రజలు కోరుకుంటున్నారని... అందుకోసం తనను ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించారు.
sample description
Last Updated : Mar 26, 2019, 12:18 PM IST