రైల్వే గేటు క్రాసింగ్ వద్ద జరుగుతున్న ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైల్వే భద్రతా విభాగం కౌన్సిలర్లు కె.చక్రవర్తి, సురేశ్ బాబు, ప్రసాద్ బాబులు పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్, ఎన్‌ఎఫ్‌సీనగర్లలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.
రైల్వేగేటు దాటేటప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. గేటు వేసి ఉన్న సమయంలో క్రాసింగ్ దాటితే అటుగా వస్తున్న రైలు శబ్దానికి వినిపించకుండా… మరో రైలు వస్తే ప్రమాదం జరుగుతుందని చెప్పారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి 10వ తేదీ వరకు… అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా గేటు దాటుతున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: MP KOMATIREDDY: అసమర్థ పాలనకు వైద్యారోగ్య శాఖ దుస్థితే సాక్ష్యం