కరోనా వ్యాక్సిన్ రెండో డోసు కోసం ఆరోగ్య కేంద్రాల వద్ద జనం బారులు - కరోనా వ్యాక్సిన్ రెండోడోసు కోసం జనం బారులు
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు కోసం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఉదయం నుంచే లైన్లలో నిల్చుని.. వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. గురువారం నుంచి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికే వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించడంతో ఆస్పత్రులకు తరలివెళ్తున్నారు.
రెండో డోసు కోసం జనం బారులు
మేడ్చల్ జిల్లా కాప్రా, మల్కాజిగిరి, కీసర ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలు బారులుతీరారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ కోసం ఉదయం నుంచే లైన్లలో నిలబడి టీకా వేయించుకుంటున్నారు.
45 ఏళ్లు పైబడిన వారికి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోకుండానే ఈ బుధవారం వరకు వ్యాక్సిన్ వేస్తుండటంతో అధిక సంఖ్యలో జనాలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలివస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నాయని.. రోజూ దాదాపు వెయ్యి మందికి పైగా వాక్సిన్లు వేస్తున్నామని వైద్యులు తెలిపారు.