.
భాగ్యనగర శివారు ప్రాంతాల్లో ప్రజలు తాగునీరు లేక అల్లాడుతున్నారు. వర్షాకాలంలో కూడా నీటి కోసం పోరాటం చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో కనీస అవసరాలకు నీరు లేదని స్థానికులు నిరసన తెలిపారు. మున్సిపాలిటీగా మారినా... నీటి ఎద్దడి తీరలేదని వాపోయారు. కనీసం నీటి ట్యాంకర్లు కూడా దొరకడం లేదని అన్నారు.
రోజుకు రూ.500
నాగారం మున్సిపాలిటీలో 118 కాలనీలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ బోర్లు ఎండిపోయాయి. ట్యాంకర్లకు రోజుకు ఐదు వందల రూపాయలు వెచ్చిస్తున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. పిల్లలకు స్నానం చేయించాలన్నా... నీళ్లు లేవని అన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని కాలనీవాసులు కోరుతున్నారు. లేకుంటే పోరాటం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : రామ్సర్ హోటల్ 'చాయ్ బంధం' తెగిపోయింది