మేడ్చల్ జిల్లా మేడిపల్లి కేంద్రనగర్కు చెందిన సోను అనే వ్యక్తి గత కొంతకాలంగా భార్యతో గొడవలు పడుతున్నాడు. భార్య పక్క కాలనీలో పుట్టింటికి వెళ్లింది. సోమవారం భార్యను తీసుకెళ్దామని వెళ్లిన భర్తతో భార్య, అత్త మరోసారి గొడవ పడ్డారు. ఇద్దరూ కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు.
భర్త కేకలు వేయడం వల్ల స్థానికుల సహకారంతో అతనిని ఆస్పత్రికి తరలించారు. 55 శాతం శరీరం కాలిపోయిందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో ఇవాళ 51 కరోనా కేసులు.. ఇద్దరు మృతి