మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన ఓ మహిళకు ఈ నెల 24న పాము కరిచింది. విషయం గుర్తించిన స్థానికులు ఆమెను వెంటనే నారాయణ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఈ నెల 29న ఆమెకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
విషయం తెలియగానే అప్రమత్తమైన అధికారులు ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లో వారిని వైద్య పరీక్షల కోసం కోఠి ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. ఈ కాలనీలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ చూడండి: తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు