మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ డీసీఎం వాహనంలో తరలిస్తున్న ఆఫీసు క్యాబిన్ తగిలి రోడ్డుపై నిలుచున్న బ్రిజ్ మోహన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీహార్ రాష్ట్రానికి చెందిన బ్రిజ్ మోహన్‌కు భార్యా, నలుగురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: బంగారు తెలంగాణ కాదు.. బాకీల తెలంగాణ: రేవంత్