మేడ్చల్ జిల్లా మల్లాపూర్ డివిజన్లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆశోక్ నగర్ కాలనీకి చెందిన విశాల్ మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై మేడ్చల్ బయలుదేరారు. మార్గం మధ్యలోని ఓ మూలమలుపు వద్ద బైకు అదుపుతప్పి కింద పడ్డారు.
విశాల్ తల నేరుగా బండరాయిపై పడటం వల్ల అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్