మేడ్చల్ జిల్లా దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజ్‌లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన నేషనల్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో బాలుల విభాగంలో హర్యానా, బాలికల విభాగంలో పంజాబ్ గెలుపపొందాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
కేంద్ర స్పోర్ట్స్ అథారిటి నుంచి రూ.10 కోట్లు
3రోజుల పాటు జరిగిన ఈ క్రీడలను తెలంగాణ ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి రాజశేఖరరెడ్డి తన సొంత డబ్బుతో నిర్వహించాడని వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. రాబోయే కాలంలో క్రీడల్లో తెలంగాణ నెంబర్ 1గా ఎదుగుతుందన్నారు. గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలో ట్రాక్ చెడి పోయిందని.. తమ కృషి వల్ల కేంద్ర స్పోర్ట్స్ అథారిటీ నుంచి రూ.10 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు.
ఇదీ చూడండి: సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు కేవలం తెరాసకే ఉంది: కేటీఆర్