కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది డివిజన్లకు తెరాస తరఫున మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా గాజులరామారం డివిజన్ అభ్యర్థి తరఫున లెనిన్‌నగర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు.
నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది డివిజన్లకు ఎనిమిది గెలుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే తెరాసను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానందరెడ్డి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, తన నియోజకవర్గంలో కూడా ఇంత అభివృద్ధి జరగలేదని తెలిపారు. ఈ మేరకు ఆయనను అభినందించారు. కారు గుర్తుకు ఓటు వేసి తెరాసను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి: పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపై సర్జికల్ స్ట్రైక్: స్మృతి ఇరానీ