మేడ్చల్ నియోజకవర్గంలో చేస్తున్న హరితహారం పనులను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. 44వ జాతీయ రహదారి, రాజీవ్ రహదారి, వరంగల్ హైవే వద్ద చేస్తున్న పనులను తనిఖీ చేశారు. తూంకుంట నుంచి తుర్కపల్లి వరకు... ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వరకు.... కొంపల్లి నుంచి మేడ్చల్ వరకు... మున్సిపాలిటీ పరిధిలో రహదారికిరువైపులా మొక్కలు నాటుతున్నట్లు వివరించారు.
ఈ నెల 18న మొక్కలునాటే కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావు, మంత్రి కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు.
ఇదీ చూడండి: డ్రైవర్‌కు కరోనా... హోం క్వారంటైన్లో జీహెచ్ఎంసీ మేయర్ కుటుంబం