మేడ్చల్ జిల్లా గిర్మాపూర్ గ్రామ రిజర్వు ఫారెస్ట్‌లో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి జిల్లా పాలనాధికారి ఎంవీరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని కోరారు. కోతులు రాకుండా ఉండాలంటే ఊరి చివర్లో అవి తినే పండ్ల మొక్కలు నాటాలని సూచించారు.
- ఇదీ చూడండి : 'ప్రజావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తా'