మేడ్చల్ జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఆలయానికి తరలివస్తోన్న భక్తులు శివలింగాలకు అభిషేకం చేసి ఉపవాసదీక్ష చేపట్టారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు.
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట రామలింగేశ్వరాలయానికి ఈరోడు జేబీఎస్, ఎల్బీనగర్, మేడ్చల్, కుషాయిగూడ నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా 450 బస్సులు నడుపుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 1500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈనెల 24వరకు కీసరగుట్టలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
- ఇదీ చూడండి : దేశమంతా 'హరహర మహాదేవ శంభోశంకర'