మేడ్చల్ జిల్లా ప్రగతినగర్ - గాజుల రామారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత ఓ బండరాయిపై కూర్చొని ఉండగా స్థానికుడొకరు చూసినట్లు... దానిని ఫొటో కూడా తీసినట్లు వెల్లడించారు. చిత్రాలను చూసిన అటవీశాఖ అధికారులు ప్రగతినగర్ - గాజులరామారం ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత జాడలేవీ దొరకలేదని వెల్లడించారు. చిరుత సంచారం వార్తతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవీ చూడండి: 'ఫేక్' ఉచ్చులో పడ్డ జనం- 'ఫ్రీ మనీ' కోసం క్యూ