మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 199 మందికి రూ.రెండు కోట్ల విలువగల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పంపిణీ చేశారు. సంక్షోభంలో ఉన్నా సంక్షేమం మాత్రం ప్రభుత్వం ఆపలేదని ఆయన అన్నారు.
నిరుపేదలకు అండగా...
నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వివేకా పేర్కొన్నారు. మరో 12 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.6.70 లక్షల విలువగల చెక్కులను వైద్య ఖర్చుల నిమిత్తం అందచేశారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇవీ చూడండి : రెవెన్యూ సంస్కరణలు ప్రజలు ఉపయోగపడేలా ఉండాలి: వీహెచ్