వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ సందడి చేశారు. పీర్జాదిగూడ పురపాలికలోని పర్వతాపూర్‌లో ఓ గేటెడ్ కమ్యూనిటీలో జరుగుతున్న వేడుకల్లో పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కల్పించారు.
అనంతరం చిన్నారులకు మట్టి వినాయక విగ్రహాల తయారీపై పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. దాదాపు 200 కుటుంబాలకు పైగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాయి. కమ్యూనిటీకి చెందిన బాల బాలికలు ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ, గణపతి హోమం నిర్వహణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ నీటిని చిమ్మడం ద్వారా విగ్రహాన్ని కాలనీలోనే నిమజ్జనం చేయనుండడం విశేషంగా నిలుస్తోంది.
ఇదీ చూడండి: వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు