.
వలస కార్మికులను కలిసిన హైకోర్టు ప్రతినిధి
వలస కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దాఖలైన పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం స్పందించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు న్యాయవాది పవన్ కుమార్ మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉన్న వలస కార్మికులను కలిసి మాట్లాడారు. ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుందని అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదితోపాటు మున్సిపల్ కమిషనర్, స్థానిక పోలీస్ అధికారులు , వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
medchal district latest news
.