మొదటి దశలో మేడ్చల్ జిల్లాలోని పల్లెల్లో రోజూ 20, 30 కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం మూడంకెల సంఖ్యకు పెరిగింది. జిల్లాలో 61 గ్రామాల్లో కరోనా కట్టడి చేయడంలో భాగంగా నారపల్లి, కీసర, శామీర్‌పేట, మూడుచింతల పల్లి, శ్రీరంగవరం, మేడ్చల్ ప్రభుత్వం ఆరోగ్య కేంద్రంలోని గ్రామాల్లో జ్వరం సర్వే నిర్వహించారు. 41,665 ఇళ్లను సందర్శించి వైద్య పరీక్షలు చేశారు. ఇందులో సుమారు 1995 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారికి మెడికల్ కిట్లు అందజేశారు. ఆరోగ్య పరిస్థితి విషమిస్తే వైద్య సిబ్బందికి ఫోన్ చేయాలని సూచిస్తున్నారు.
కరోనా ఉద్ధృతిని ఆరికట్టడంలో భాగంగా టీకా ప్రక్రియను వేగవంతం చేయాలన్న కలెక్టర్ ఆదేశాలతో 61 గ్రామపంచాయతీల్లో టీకా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యకార్యకర్తలు సమావేశాలు ఏర్పాటు చేసి వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచులు చొరవ తీసుకుని మురుగు కాల్వల వెంట బ్లీచింగు పౌడర్ చల్లిస్తున్నారు.
ఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం