ETV Bharat / state

పోలింగ్​ ప్రశాంతం.. ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం - telangana politics

హైదరాబాద్, మేడ్చల్ జిల్లా పరిధిలో పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు సాగింది. చెదురు మదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ముగిసింది.

graduate-mlc-elections
పోలింగ్​ ప్రశాంతం.. ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం
author img

By

Published : Mar 14, 2021, 10:07 PM IST

చెదురు మదురు ఘటనలు మినహా హైదరాబాద్​, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా జరిగింది. ఫలితంగా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకొంది.

అల్వాల్ మున్సిపల్ పరిధిలోని 135వ డివిజన్​లో పోలింగ్ కేంద్రం వద్ద తెరాస నేతలు, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. వెంకటాపురం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్​లోకి గులాబీ టీ షర్ట్​లతో తెరాస ఏజెంట్లు వచ్చారు. అక్కడున్న పోలింగ్ సిబ్బంది అభ్యంతరం తెలిపారు.
అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. సురారం కాలనీ నీలిమ పాఠశాలలోనూ తెరాస కార్యకర్తలు గులాబీ రంగు టీ షర్ట్​లతో రావడంపై ఇతర పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు అభ్యంతరం తెలిపారు.

కార్వాన్​లోని కుస్లుంపుర ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జియాగూడ కార్పొరేటర్ దర్శన్, మాజీ కార్పొరేటర్ మిత్ర కృష్ణ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ఇరువురిని శాంతింపజేశారు. మీర్​పేటలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే క్రమంలో అనూష అనే యువతి కళ్లు తిరిగి కింద పడిపోయింది. అప్రమత్తమైన పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ జిల్లాల పరిధిలో ఇక్కడ ఓటేసిన ప్రముఖులు..

  • పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఓటు వేశారు.
  • రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఉప్పర్​పల్లి అమర్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • బంజారాహిల్స్ రోడ్ నంబర్-13లోని నీటిపారుదల శాఖ కార్యాలయం ఏర్పాటుచేసిన పోలింగ్​ కేంద్రంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఓటేశారు.
  • కుత్బుల్లాపూర్ ఎస్​వీఎన్​ పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • కూకట్‌పల్లి కేపీహెచ్​బీ కాలనీలో ఎమ్మెల్సీ నవీన్​రావు ఓటేశారు.
  • మలక్​పేటలో అగ్రికల్చర్ కార్యాలయంలో హోంమంత్రి మహమూద్​ అలీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • తార్నాక సంఘీ పాఠశాలలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్​రావు ఓటేశారు.
  • రామంతాపూర్​లో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్ఎస్ ప్రభాకర్​ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • గాంధీనగర్​లోని తూనికలు కొలతల శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్​ కేంద్రంలో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఓటు వేశారు.
  • హిమాయత్​నగర్​లోని ఉర్దూ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇవీచూడండి: భారీగా తరలివచ్చిన పట్టభద్రులు... 60 శాతానికి పైగా పోలింగ్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.