గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఉప్పల్ సర్కిల్లో రెండు డివిజన్‌లో భాజపా గెలుపొందగా... తెరాస, కాంగ్రెస్ ఒక్కో స్థానంలో విజయం సాధించాయి.
హబ్సిగూడ డివిజన్‌లో పోటీ చేసిన ప్రస్తుత కార్పొరేటర్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి సతీమణి భాజపా అభ్యర్థి చేతన చేతిలో ఓటమి పాలయ్యారు. చేతనకు 10,803 ఓట్లు రాగా... తెరాస అభ్యర్థి బేతి స్వప్నకు 9,356 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 1,969, నోటాకు 218 ఓట్లు నమోదయ్యాయి. 426ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.
రామంతాపూర్ డివిజన్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత కార్పొరేటర్ గంధం జ్యోత్స్న పరాజయం పాలయ్యారు. తొలిసారి పోటీ చేసిన భాజపా అభ్యర్థి బండారు శ్రీవాణి వెంకట్రావు గెలుపొందారు. భాజపా-16,033, తెరాస-9378, కాంగ్రెస్-1926, తెదేపా-274, నోటా-225 రాగా 320 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.
చిలుకానగర్‌లో తెరాస అభ్యర్థి పన్నాల గీత ప్రవీణ్ విజయం సాధించారు. తెరాస-10,205, భాజపా- 597, కాంగ్రెస్-2724, ఇతరులు 231, నోటాకు 260 ఓట్లు వచ్చాయి. 451 ఓట్లు తిరస్కరణకు గరయ్యాయి.
ఉప్పల్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి రజిత, తెరాస అభ్యర్థి శాలినీపై ఘన విజయం సాధించారు. కాంగ్రెస్-14,421, తెరాస-8,509, భాజపా-4,314 నోటాకు 245 ఓట్లు వచ్చాయి. 527 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.
భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ చేపట్టిన అభివృద్ధి పనులే తమ విజయానికి కారణమని హబ్సిగూడ, రామంతాపూర్ కార్పొరేటర్లు చేతన, శ్రీవాణీలు పేర్కొన్నారు. పరమేశ్వర్‌రెడ్డి కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులే తన గెలుపు ఖాయమైందని ఉప్పల్ కార్పొరేటర్ రజిత పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కనుమరుగైన తెదేపా