ETV Bharat / state

Ganjaa Smugling in Telangana : గంజాయి రవాణా చేస్తున్న ముఠాల అరెస్ట్​.. 400 కిలోలు స్వాధీనం

Ganjaa Smugling gang arrest in Kukatpally : రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు చోట్ల పెద్దమొత్తంలో గంజాయి అక్రమరవాణా చేస్తున్న ముఠాలను.. పోలీసులు అరెస్టు చేశారు. కూకట్​పల్లి, భద్రాద్రి కొత్తగూడెంలో రెండు చోట్ల కలిపి 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Ganjaa
Ganjaa
author img

By

Published : Jul 10, 2023, 7:18 PM IST

గంజాయి రవాణా చేస్తున్న ముఠాల అరెస్ట్​.. 400 కిలోలు స్వాధీనం

Ganjaa Smugling gang arrest in Telangana : ముందు ఎస్కార్ట్ కార్.. ఆ కారు సమాచారం ప్రకారం వెనకాలే మరో కారులో గంజాయి రవాణా.. ఇదీ స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ. సులభంగా డబ్బు సంపాదించడం కోసం ముఠాగా ఏర్పడి.. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను మాదాపూర్ ఎస్ఓటి, కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఆంధ్రప్రదేశ్​లోని మారెడుమిల్లి నుంచి జహీరాబాద్​కు తరలిస్తున్న 230 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కిషన్​బాగ్​కు చెందిన అఖిల్.. మెదక్ జిల్లా కోహిర్ గ్రామంలో కోళ్లఫారంలో పని చేస్తుంటాడు. గంజాయి తరలించటం, విక్రయించడం చేస్తూ, గంజాయి విక్రయదారులకు మధ్యవర్తిత్వం వహిస్తాడు. మియాపూర్​కు చెందిన షేక్ అలావుద్దీన్, హౌడేకర్ విజయ్, వహీద్, అజిత్, వంశీలు.. ఈ ఐదుగురు కలిసి ఓ ముఠాగా ఏర్పడి, పెద్దమొత్తంలో గంజాయి స్మగ్లింగ్​కు పథకం వేశారు.

వీరు ఆంధ్రప్రదేశ్​లోని మారేడుమిల్లిలో వంటల రఘురాం అనే వ్యక్తి దగ్గర 230 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. స్మగ్లింగ్ చేస్తూ పోలీసుల కంట పడకుండా ఉండేందుకు.. కారులో వంశీ, విజయ్​లు ఇద్దరు ఎస్కార్ట్ వాహనంలాగా ముందు వెళ్లేవారు. వారి వెనకాలే మిగతా వారు గంజాయితో ఉన్న కారులో వెళ్లేవారు. ఎక్కడైనా పోలీసుల తనిఖీలు ఉంటే.. వంశీ, విజయ్​లు వెనకాల గంజాయి కారులో ఉన్న అల్లావుద్దీన్, వహీద్​లకు సమాచారం అందించేవారు.

ఈ విధంగా వీరు మారేడుమిల్లి నుంచి జహీరాబాద్​కు గంజాయి తరలిస్తుండగా, మాదాపూర్ ఎస్ఓటి పోలీసులకు పక్కా సమాచారం అందటంతో, కూకట్‌పల్లి పోలీసులతో కలిసి కూకట్‌పల్లి వై జంక్షన్ ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి.. 230 కేజీల గంజాయితో పాటు, తరలింపునకు ఉపయోగించిన రెండు కార్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు.

భద్రాది కొత్తగూడెంలో 200 కిలోల గంజాయి స్వాధీనం..

Ganjaa smugling in bhadradri kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో రూ. 40 లక్షల విలువ చేసే 200 కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అక్రమ రవాణా చేస్తూ.. భద్రాచలం నుంచి ఇల్లందు వైపు అతివేగంగా వస్తున్న కారు టేకులపల్లి మండలం వెంకట్య తండా స్టేజి వద్ద ఆటోని ఢీకొంది. అనంతరం కారు వేగంగా వెళుతుండడంతో స్థానికులు వెంబడించగా సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లింది. తీరా చూడగా కారులో గంజాయి ఉండటం కలకలం సృష్టించింది. కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.