ద్విచక్రవాహనాన్ని నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితుడితో పాటు.. అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో జరిగింది.
సురారం కాలనీలో గత ఆదివారం సోము జగదీశ్ (19) అనే వ్యక్తి తన తండ్రి బైక్‌తో బయటకి వెళ్లాడు. వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ రఘునాథ్(50) అనే వ్యక్తిని ఢీ కొట్టాడు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు.. చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు.
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేల్చారు. మృతికి కారణమైనందుకు అతన్ని, వాహనం ఇచ్చినందుకు అతని తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: క్రైం కథలు: బీమా ఏజెంట్ల దారుణాలు... విస్తుపోయే నిజాలు