Etela Jamuna Comments: రాజకీయ అక్కసుతోనే మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన సతీమణి జమున మండిపడ్డారు. భూములను బలవంతంగా ఆక్రమించుకున్నారని కలెక్టర్ చెప్పినట్లు ఆమె తెలిపారు. ఈటల రాజేందర్ 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నారన్న జమున... అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ అధికారికైనా ఫోన్లు చేశారా అని ప్రశ్నించారు. అధికారులకు ఫోన్లు చేసి భూములు ఆక్రమించుకున్నారా? అడిగారు. గతంలో లేనిది ఇప్పుడే ఆక్రమించుకున్నారని ఎందుకు చెబుతున్నారని నిలదీశారు.
'మంత్రులు ఫోన్లు చేస్తే తహసీల్దార్లు వెంటనే రిజిస్ట్రేషన్లు చేస్తారా? సీఎం ఫోన్లు చేస్తే ఎన్ని రిజిస్ట్రేషన్లు చేయాలి? సీఎం ఇంట్లో కూడా మంత్రులు ఉన్నారు? మంత్రులు ఫోన్లు చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారా? దరఖాస్తు చేసిన 45 రోజుల్లో నాలా కన్వెన్షన్ చేయాలని కేటీఆర్ చెప్పారు. 45 రోజుల్లో ఇవ్వకపోతే ఆమోదం పొందిననట్లేనని తెలిపారు. దరఖాస్తు చేసి 3 నెలలైనా మాకు నాలా కన్వెన్షన్ రాలేదు.'
-- జమున, ఈటల సతీమణి
ఇవీ చూడండి: jamuna hatcheries lands : జమున హేచరీస్ భూముల్లో మొదటి రోజు సర్వే పూర్తి
MLA Etela land survey : ఎమ్మెల్యే ఈటల భూములపై నేటి నుంచి సర్వే