రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా మొదటిరోజు సర్వర్లు మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని మేడ్చల్ జిల్లా ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు దస్తావేజు లేఖరులు ఆందోళనకు దిగారు.
ధరణి పోర్టల్లో సాంకేతిక సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. కార్యాలయంలోకి వెళ్లి పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో స్థిరాస్తి వ్యాపారులు, దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు.