ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టి తాము ఉపాధిని కోల్పోయేలా చేస్తోందని డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేయడం ఎంతవరకు సమంజసమని రైటర్లు ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఇష్టారీతిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత