ETV Bharat / state

కొవిడ్ వ్యాక్సిన్​పై అపోహలు నమ్మొద్దు : మంత్రి మల్లారెడ్డి

కొవిడ్ టీకా విషయంలో ప్రజలు అనుమానపడొద్దని, ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వ్యాక్సిన్​ తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు. మేడ్చల్ జిల్లా బోయిన్​పల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్​ను ప్రారంభించారు.

Covid Vaccine Center at BowenPally
బోయిన్​పల్లిలో కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్
author img

By

Published : Jan 19, 2021, 1:27 PM IST

కొవిడ్ వ్యాక్సిన్ తయారు చేసిన భారత్​ బయోటెక్ మేడ్చల్​ జిల్లాలో ఉండటం గర్వకారణమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరు కరోనా టీకా వేసుకుని, మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు. వ్యాక్సినేషన్​పై ఎలాంటి అపోహలు నమ్మకూడదని చెప్పారు.

మేడ్చల్ జిల్లా బోయిన్​పల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్​ను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోయిన్​పల్లి, పికెట్, తిరుమలగిరి ప్రాంతాల్లో టీకా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటగా వైద్యులు, వైద్య సిబ్బంది, కరోనా వారియర్స్​కు ఇచ్చిన తర్వాత వృద్ధులకు దశల వారీగా టీకాలు వేస్తామని మంత్రి వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.