మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రామంతాపూర్ డివిజన్ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య సిబ్బంది శ్రమిస్తున్నారు.
అర్ధరాత్రి వేళ కరోనా రహదారులపై రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. ఈ పనులను కార్పొరేటర్ బండారు శ్రీవాణి పరిశీలించారు. ఈ విపత్కర కాలంలో ప్రజలకు అండగా ఉంటానని కార్పొరేటర్ తెలిపారు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై ఇవాళ సర్కారు కీలక నిర్ణయం!