మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఠాణా పరిధిలోని ఎల్ఐజీ కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలులేని 27 ద్విచక్రవాహనాలు, రెండు సంచుల నిషేధ గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. అనుమానంగా సంచరిస్తున్న ఓవ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లైతే నేరాలు తగ్గుముఖం పడతాయని డీసీపీ రక్షితాకృష్ణమూర్తి తెలిపారు.
ఇదీ చూడండి: డీసీపీ అవినాష్ మహంతిపై ఓ వ్యక్తి ఫిర్యాదు