ఓ కానిస్టేబుల్ సాహసంతో తల్లీ, కుమారుడు క్షేమంగా ఉన్నారు. కుమారుడితో సహా ఆత్మహత్యకు(suicide) యత్నించిన ఓ మహిళను కానిస్టేబుల్ కుద్దూస్ కాపాడారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లి నివాసముండే రాధ, భర్తతో గొడవపడినట్లుగా స్థానికులు తెలిపారు. మనస్తాపానికి గురై ఆమె రెండేళ్ల చిన్నారిని తీసుకొని జయభేరి కాలనీలోని క్వారీలో దూకడానికి ప్రయత్నించగా కానిస్టేబుల్ గమనించారు.
వెంటనే అక్కడికి వెళ్లి ఆమెకు నచ్చజెప్పి... వారిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లి, కుమారుడిని కాపాడిన కానిస్టేబుల్ కుద్దూస్ని ఉన్నతాధికారులు అభినందించారు.
ఇదీ చదవండి: అమానుషం: కన్నకూతురిపైనే తండ్రి అత్యాచారం