తెలంగాణ గత 52 రోజులుగా జరిగిన సమ్మెను పార్లమెంట్లో కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీరేవంత్రెడ్డి ప్రస్తావించారు. ప్రభుత్వం కార్మికులను అసలు పట్టించుకోవట్లేదని, కేంద్రం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గత 52 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా... 30 మందికి పైగా కార్మికులు చనిపోయినా... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కేంద్రం దృష్టికి తెచ్చారు. ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపలేదని, సమ్మె ముగించి ఉద్యోగాల్లో తిరిగి చేరుతామన్నా... ప్రభుత్వం వినే పరిస్థితిలో లేదని మండిపడ్డారు.
బాబు అనే కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ కార్మికుడు చనిపోతే... అంత్య క్రియల్లో జరిగిన గొడవలో ఎంపీ బండి సంజయ్‌పై రాష్ట్ర పోలీసులు దాడి చేశారని... బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేస్తోందని... 33శాతం కేంద్రం వాటా కూడా ఉందని... కావునా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ కూటమిపై అమిత్ షా ఫైర్