ETV Bharat / state

'కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి' - హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సీఐటీయూ ధర్నా

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని కార్మిక సంక్షేమ భవనం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. నాచారంలోని డిడైట్రిచ్ కంపెనీ నుంచి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

'కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి'
'కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి'
author img

By

Published : Sep 11, 2020, 7:53 PM IST

మేడ్చల్ జిల్లా నాచారంలోని డిడైట్రిచ్ కంపెనీ నుంచి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ ఆందోళన చేపట్టింది. సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న కార్మికుల పట్ల డిడైట్రిచ్ కంపెనీ యాజమాన్యం అనుసరిస్తున్న మొండివైఖరి వీడాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని కార్మిక సంక్షేమ భవనం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు.

1986లో నవభారత్ ఇండస్ట్రియల్ లైనింగ్స్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్న కార్మికులను ఆ కారణంగా చట్ట విరుద్ధంగా యాజమాన్యం తొలగించిందని తెలిపారు. కంపెనీపై కార్మిక శాఖ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖ కమిషనర్ కు సీఐటీయూ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు.

ఇదీ చూడండి:నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.