ETV Bharat / state

'ఆపదలు వచ్చినా సంక్షేమ పథకాలను ఆపేది లేదు' - cheques distribution in qutbullapur constituency

కుత్బుల్లాపూర్​ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 666 మందికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్​ చెక్కులను పంపిణీ చేశారు.

cheques distribution in qutbullapur
కుత్బుల్లాపూర్​లో చెక్కుల పంపిణీ
author img

By

Published : May 21, 2021, 4:44 PM IST

Updated : May 21, 2021, 5:39 PM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ 8 డివిజన్లకు చెందిన 666 మంది లబ్ధిదారులకు.. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అందజేశారు. కుత్బుల్లాపూర్​ తహసీల్దార్​ కార్యాల‌యం వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు.

ఎంతటి విపత్తు వచ్చినా పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తూనే ఉందని ఎమ్మెల్యే అన్నారు. పేదల సంక్షేమాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పేదల పాలిట పెన్నిధిగా మారారని వెల్లడించారు. సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, లాక్​డౌన్​కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: రాజకీయ పట్టింపులకు పోకుండా రెండో డోసు ఇవ్వాలి: కిషన్ రెడ్డి

Last Updated : May 21, 2021, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.