మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఐదో వార్డులో రోజురోజుకు కొవిడ్ కేసులు వ్యాపిస్తున్నందున సామాజిక కార్యకర్త సతీష్ గుప్తా మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. కంటోన్మెంట్ తెరాస నేత మల్లికార్జున్ సహకారంతో కరోనా కేసులు అధికంగా ఉన్న కంటైన్మెంట్ ప్రాంతంతో రసాయనిక సోడియం హైడ్రోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.
కరోనా వేగంగా విజృంభిస్తున్నందున ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న కాలనీని రెడ్‌జోన్‌గా ప్రకటించాలన్నారు. నియోజకవర్గంలో కేసులు పెరుగుతున్నా అధికారులు పూర్తిస్థాయిలో వైరస్ కట్టడికి కృషి చేయట్లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సతీష్ కోరారు.