మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం మజీద్ పూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు దాటుతున్న కారును, అదుపు తప్పిన ఆటో ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు.
బల్కంపేట్ నుంచి కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్తుండగా ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ములుగులోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి : సర్కారు నిర్లక్ష్యం..రైతన్న ప్రాణంతో చెలగాటం