మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి చౌదరిగూడ వెంకట సాయినగర్‌లో నివాసం ఉంటున్న మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
![నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి నివాసంలో అనిశా సోదాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8738706_acb2.png)
అదనపు కలెక్టర్ నగేష్ కేసులో భాగంగా..
మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఏసీబీ కేసులో భాగంగా ఆర్డీవో ఇంట్లో సోదాలు చేస్తున్నారు. మీడియాకు ఇప్పడే పూర్తి సమాచారం ఇవ్వలేమని అనిశా అధికారులు పేర్కొన్నారు. పాత్రికేయులను సోదాలు జరుగుతున్న ప్రాంతానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు.
![నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి నివాసంలో అనిశా సోదాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8738706_acb3.png)
ఇవీ చూడండి : రెవెన్యూ సంస్కరణలతో ప్రజల ఇబ్బందులు తొలగుతాయి: కేసీఆర్