ETV Bharat / state

అనిశాకు చిక్కిన అవుట్​సోర్సింగ్​ ఉద్యోగి - acb rides Dundigal MRO office latest news

acb rides latest news
acb rides latest news
author img

By

Published : Dec 23, 2019, 4:02 PM IST

Updated : Dec 23, 2019, 7:39 PM IST

15:58 December 23

అనిశాకు చిక్కిన అవుట్​సోర్సింగ్​ ఉద్యోగి

 మేడ్చల్​ జిల్లా దుండిగల్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నరేందర్​ రెడ్డి అనిశాకు చిక్కాడు. బహదూర్ పల్లిలోని 248 సర్వేనెంబర్​లో 30 గుంటల స్థలాన్ని ఆన్​లైన్​ చేసేందుకు నరేందర్​ రెడ్డి... శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర రూ.40 వేలు లంచం డిమాండ్ చేశాడు. శ్రావణ్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడం వల్ల ఇవాళ నేరుగా నరేందర్ రెడ్డి నలబై వేల రూపాయలు  తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. 

             రేపు ఏసీబీ కోర్టులో నిందితుడిని హాజరు పరచి... అనంతరం చంచల్ గూడ జైలుకు తరలిస్తామని  ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఈఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.
 
ఇదీ చూడండి : మిర్చి రైతులకు ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆవేదన..

Last Updated : Dec 23, 2019, 7:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.