హిందూ మతంపై గురుకులాల విద్యార్థుల మనసుల్లో విషం నింపుతున్న గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కూకట్‌పల్లి జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు.
ప్రవీణ్ కుమార్ క్రైస్తవ మిషనరీలతో కుమ్మక్కై, బౌద్ధ మతం ముసుగులో విద్యార్థుల్లో హిందూ మతంపై విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. గురుకులాల్లో స్వేరోలు కాంట్రాక్టులు పొంది అక్రమాలకు పాల్పడుతున్నారని, బాలికలపై అఘాయిత్యాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నూతన సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్