సరదాగా చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజాంపేట మండలం బచ్చురాజుపల్లి తండాకు చెందిన నేనావాత్ రవి అనే యువకుడు ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి సరదాగా చేపలు వేటకు వెళ్లాడు. ఈ క్రమంలోనే రవి ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడు. ఈత రాకపోవడంతో మృతిచెందాడు. మృతుడికి ఓ భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
నిజాంపేట ఎస్సై రామ్‌చందర్ నాయక్ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: న్యాయం చేయాలని.. భర్త ఇంటి ముందు వివాహిత ధర్నా