War tanks at Medak ODF: యుద్ధంలో శత్రు సైన్యాలపై నిప్పులు కురిపించే యుద్ధ ట్యాంకులను చూడాలని అందరికీ ఉంటుంది. కానీ వాటిని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉండదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ.. యుద్ధ వాహనాలను చూసే అవకాశం సాధారణ ప్రజలకు కల్పిస్తోంది. వాటి విన్యాసాలను వారం పాటు సాగే ఈ ప్రదర్శనలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కల్పిస్తున్నారు.
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా
'మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. యుద్ధ వాహనాలు తయారు చేయడంలో ముందున్నాం. రణక్షేత్రానికి సైనికులను చేరవేసేందుకు లైట్ వెహికిల్స్, ఏఈఆర్‌వీ, సీసీపీటీ, సీఎమ్‌టీ వాహనాలు తయారు చేస్తున్నాం. 1991 తర్వాత డీఆర్‌డీఓ, వీఆర్‌డీఏతో కలిసి పనిచేస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా నామికా వాహనం తయారీ చేపడుతున్నాం. ప్రస్తుతం ట్రయల్స్ పూర్తి చేసుకున్న నామికా వాహనాలను.. మరో 6-7 నెలల్లో సైన్యానికి అందజేస్తాం.' -నాగబాబు, మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏజీఎమ్
ఆర్మ్‌డ్ అంబులెన్స్‌లు
new combat vehicles at medak odf: కొండలు, గుట్టలు వంటి రహదారుల్లో వెళ్లేలా బీఎమ్‌పీ రూపకల్పన చేశాం. బీఎమ్‌పీ రోడ్డుపై 65 కి.మీ, నీటిపై 30 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఇంజినీరింగ్ వాహనంగా ఏఈఆర్‌వీకి గుర్తింపు ఉంది. యుద్ధంలో క్షత్రగాత్రుల్ని తరలించేందుకు ఆర్మ్‌డ్ అంబులెన్స్‌లు తయారీ చేశాం. ప్రస్తుతం 150 యుద్ధ వాహనాలు తయారు చేస్తున్నాం. -నాగబాబు, మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏజీఎమ్
35 సెకన్లలో ఏం చేయగలరని ఎవరైనా అడిగితే చెప్పేందుకు రెండు మూడు క్షణాలు ఆలోచిస్తాం. అదే బీడీఎల్కు ఆ ప్రశ్న వేస్తే క్షణం ఆలోచించకుండా వివిధ దేశాల నుంచి భారత భూభాగంలోకి వచ్చిన 4 యుద్ధ విమానాలను 25 కిలోమీటర్ల దూరంలోనే ఒకేసారి నాశనం చేస్తామని చెప్పేస్తుంది. ఈ సంస్థ సామర్థ్యం తెలుసుకోవాలంటే ఈ ఒక్క ఉదాహణ చాలంటున్నారు.. రక్షణ రంగ నిపుణులు.
ఇదీ చదవండి: 'యుద్ధ విమానాల పవర్'లో భారత్ ర్యాంక్ @ 4