30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లా శివ్వంపేటలో స్థానిక కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించారు. గ్రామాలను హరిత వనాలుగా మార్చుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ హేమలత, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్?