మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పట్టణంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ తరుణంలో స్థానిక పురపాలిక ఛైర్మన్ మురళీ యాదవ్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలపై చర్చించారు. పట్టణంలోని దుకాణాలు, వ్యాపారాల నిర్వహణపై ఆంక్షలను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరచి ఉంచాలని దుకాణాదారులకు సూచించారు. నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో సైతం ఇదే విధానం అమలు చేస్తున్నట్లు మున్సిపల్ ఛైర్పర్సన్ మురళీ యాదవ్, ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పాటించని వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు.
ఇవీ చూడండి: కల్నల్ సంతోష్ బృందాన్ని ఉచ్చులో బిగించారా?