ETV Bharat / state

లాక్​డౌన్​ సడలింపుతో రోడ్డెక్కిన జనం

author img

By

Published : May 19, 2020, 9:46 PM IST

రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్​ సడలించడం వల్ల మెదక్​ జిల్లాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండు నెలలుగా నిర్మానుష్యమైన రోడ్లు తిరిగి వాహనాల రద్దీతో నిండిపోయాయి. లాక్​డౌన్​ వల్ల స్తంభించిన ప్రజా రవాణా ప్రభుత్వ అనుమతితో తిరిగి ప్రారంభమైంది. మరోవైపు దుకాణాలు కూడా తెరవడం వల్ల జనాలు పలు అవసరాల కోసం రోడ్ల మీదకు వచ్చారు.

Traffic in Medak in Lock Down 4.0
లాక్​డౌన్​ సడలింపుతో రోడ్డెక్కిన జనం

లాక్​డౌన్​ సడలింపు వల్ల మెదక్​ జిల్లాలో సాధారణ పరిస్థితి నెలకొంది. గత 58 రోజులుగా నిలిచిపోయిన వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. మూడు విడతల లాక్​డౌన్​ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ సడలించి రవాణా, వ్యాపార సముదాయాలకు అనుమతి ఇవ్వడం వల్ల మెదక్​ జిల్లాతో పాటు.. పలు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొంది. మెదక్​ జిల్లాలోని అన్నీ మండల కేంద్రాల్లో, గ్రామాల్లో దుకాణాలు పూర్తిగా తెరుచుకున్నాయి.

ఆర్టీసీ బస్సుల రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి. తొలిరోజు 40 బస్సులు మెదక్​ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్​, సికింద్రాబాద్​, సంగారెడ్డి, పటాన్​చెరు, సిద్దిపేట, చేగుంటతో పాటు పలు రూట్లలో తిరిగాయి. 58 రోజులుగా ఇళ్లకే పరిమితమైన జనాలు బస్సులు, వాహనాల రాకపోకలు మొదలు కావడం వల్ల రోడ్ల మీదకు వచ్చారు. రోడ్లు, దుకాణాలు కిటకిటలాడాయి.

ఇవీ చూడండి: 'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.