ETV Bharat / offbeat

శరన్నవరాత్రుల స్పెషల్ : పప్పులు నానబెట్టకుండా "ఇన్​స్టంట్ పూర్ణం బూరెలు" - ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి! - Poornam Boorelu Recipe

Poornam Boorelu Recipe : దసరా వచ్చేస్తోంది. రేపటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. నవరాత్రులలో భాగంగా మహాశక్తిగా కొలిచే దుర్గామాతకు నవ నైవేద్యాలను నివేదిస్తాం. ఈ నేపథ్యంలో మీకోసం ఒక స్పెషల్ నైవేద్యం రెసిపీ పట్టుకొచ్చాం. అదే.. ఇన్​స్టంట్ పూర్ణం బూరెలు. వీటిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

Instant Poornam Boorelu
Poornam Boorelu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 2, 2024, 5:16 PM IST

How to Make Instant Poornam Boorelu : దేశవ్యాప్తంగా అక్టోబర్ 3 నుంచి దేవీ శరన్నవరాత్రులు మొదలుకానున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా 9 రోజులు.. 9 అలంకారాలతో దర్శనమిచ్చే అమ్మను చూసి తరిస్తాం. కోరిన కోర్కెలు తీర్చే ఆ కరుణామయికి రకరకాల రుచికరమైన నైవేద్యాలు సమర్పిస్తాం. ఈ నేపథ్యంలోనే మీకోసం ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. ఇన్​స్టంట్ పూర్ణం బూరెలు. పప్పులు నానబెట్టే పనిలేకుండా చాలా తక్కువ సమయంలో వీటిని ఈజీగా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించొచ్చు. ఇంతకీ, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

స్టఫింగ్​(పూర్ణం) కోసం :

  • వేయించిన పుట్నాల పప్పు - అర కప్పు
  • కొబ్బరి తురుము - 1 కప్పు
  • బెల్లం తురుము - అర కప్పు
  • వాటర్ - పావు కప్పు
  • నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
  • యాలకుల పొడి - పావు టీస్పూన్

కోటింగ్ కోసం :

  • గోధుమపిండి - 1 కప్పు
  • బియ్యప్పిండి - పావు కప్పు
  • ఉప్పు - చిటికెడు
  • పంచదార - 1 టీస్పూన్
  • వాటర్ - ఒకటిన్నర కప్పు
  • వంటసోడా - పావు టీస్పూన్
  • నూనె - వేయించడానికి తగినంత

తయారీ విధానం :

  • ఈ రెసిపీలోకి మొదటగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా మిక్సీ జార్​లో వేయించిన పుట్నాలు తీసుకొని కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఆతర్వాత అదే మిక్సీ జార్​లో పచ్చికొబ్బరి ముక్కలు వేసుకొని 1 కప్పు పరిమాణంలో తురుములా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పడు స్టౌపై పాన్ పెట్టుకొని బెల్లం వేసుకొని వాటర్ పోసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి గరిటెతో కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించుకోవాలి. అంతేకానీ.. పూర్తిగా పాకం రావాల్సిన పనిలేదు.
  • ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా ఉండాలనుకుంటే మరో రెండు టేబుల్​స్పూన్ల బెల్లం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఆవిధంగా మరిగాక పాన్​ను దించి పక్కన పెట్టేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై మరో పాన్​ను పెట్టుకొని 1 టేబుల్​స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది పూర్తిగా కరిగాక ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును వేసి మంటను లో ఫ్లేమ్​లో ఉంచి 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడినీ అందులో వేసుకొని కలుపుతూ మరో నిమిషం పాటు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక.. అందులో మరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్​ని జల్లీతో వడకట్టుకొని పోసుకోవాలి.
  • ఆపై మంటను లో ఫ్లేమ్​లోనే ఉంచి మిశ్రమం కాస్త గట్టిపడే వరకు గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. మరీ ఎక్కువగా గట్టిపడే వరకు ఉంచకూడదు.
  • మిశ్రమం కాస్త గట్టిపడిందనుకున్నాక.. అందులో మరో టేబుల్​స్పూన్ నెయ్యి, యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితో పట్టుకుని చూస్తే ఉండలా రావాలి. అలా వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఆవిధంగా వచ్చాక స్టౌ ఆఫ్ చేసుకొని పాన్​ను దించుకోవాలి.
  • ఆ తర్వాత మిశ్రమం చేతితో పట్టుకోవడానికి వీలుగా కాస్త చల్లారాక కొద్దిగా కొద్దిగా తీసుకుంటూ ఉండలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు కోటింగ్ కోసం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం.. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమపిండి, బియ్యప్పిండి, ఉప్పు, పంచదార వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి.
  • అయితే.. పిండి అనేది దోశల పిండి కంటే కాస్త మందంగా ఉండేలా చూసుకోవాలి. ఆవిధంగా కలుపుకున్నాక అందులో వంటసోడా వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై.. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. కలిపి పెట్టుకున్న పిండిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తురుము ఉండలు డిప్ చేసి ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి.
  • ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్​లోకి తీసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "పూర్ణం బూరెలు" రెడీ!
  • అనంతరం వాటిని ప్లేట్​లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి.

ఇవీ చదవండి :

నవరాత్రి స్పెషల్ : అమ్మవారు మెచ్చే "నువ్వులన్నం" - ఇలా ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టండి!

గుడిలోని ప్రసాదమంత టేస్టీ పులిహోర ఇంట్లోనే! - ఈ చిన్న టిప్స్​ పాటిస్తే అద్భుత రుచిని అస్వాదిస్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.