మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధి పలు గ్రామాల్లో ఈదురు గాలితో కూడిన వర్షానికి తీవ్ర నష్టం జరిగింది. వెల్దుర్తి, మెల్లూరు, హకీంపేట, ఎలుకపల్లి తదితర గ్రామాల్లో నష్టం భారీగా వచ్చింది. మెల్లూరులో గ్రామంలో ఇళ్ల పైకప్పులు, వైకుంఠదామం రేకులు ధ్వంసమయ్యాయి. రామాయంపేట మండలంలోని దామరచెర్వు తండాలో విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. ఒక స్తంభం గ్రామానికి చెందిన దేవసోత్ బోజ్య ఇంటిపై పడటం వల్ల పైకప్పు కూలింది.
పిడుగు శబ్దం.. ఇద్దరికి అస్వస్థత
పిడుగుపడ్డ శబ్దానికి ఇద్దరు అస్వస్థతకు గురైన ఘటన నిజాంపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బండారి నరేందర్, రమేష్ తమ వ్యవసాయ పొలం వద్ద పని చేసుకుంటున్నారు. ఈ సమయంలో పిడుగు పాటు శబ్దానికి భయపడి అస్వస్థతకు గురయ్యారు. సమీపంలో ఉన్న వ్యక్తులు వెంటనే గమనించి వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: చేపల వేటకు వెళ్తే చిరుత కనిపించింది.. !