మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్, మల్కాపూర్, కోనాయిపల్లి గ్రామాల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భవనాల ప్రారంభోత్సవాలు చేశారు. తూప్రాన్ ఎంపీపీ స్వప్నతో పాటు పలువురు తెరాసలో చేరగా.. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మల్కాపూర్‌లో సుమారు 30 మందికి ఇంటికి రెండు పశువులను పొందే అర్హత పత్రాలను అందజేశారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ఐక్యంగా ఉండి, గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్రం మొత్తం ఆదర్శ గ్రామమైన మల్కాపూర్ వైపు చూస్తుందని.. మిగతా గ్రామాలు సైతం మల్కాపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు హేమలత, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రతాప్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా అంబికాపుర్